telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

డుకాటీ .. హైపర్ మోటార్డ్ 950 .. ద్విచక్రవాహనం .. 937సీసీ ..

dukati new bike hyper motored 950 with 937 cc

డుకాటీ సంస్థ నుండి ‘హైపర్‌ మోటార్డ్‌ 950’ పేరుతో అధునాతన ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ 937 సీసీ ట్విన్‌ సిలెండర్‌ ఇంజిన్‌తో విడుదల కాగా.. ధర రూ.11.99 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా డుకాటి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సెర్గీ కానోవాస్‌ మాట్లాడుతూ.. ‘ప్రత్యేకించి యువత కోసం రూపొందిన బైక్‌ ఇది. స్పోర్ట్స్‌ ఫీచర్స్‌ కలిగి, నిర్భయంగా నడపగిలిగే సూపర్‌ బైక్‌గా మార్కెట్లోకి ప్రవేశించింది’ అన్నారాయన.

హైదరాబాద్, ముంబై, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, కొచ్చి, కోల్‌కత్తా, చెన్నైలలోని డుకాటీ డీలర్‌షిప్స్‌ వద్ద బుకింగ్స్‌ ప్రారంభమైనట్లు తెలిపారు.

Related posts