telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ తమ్ముడు “దొరసాని” విడుదలకు ముహూర్తం ఖరారు

Shivathmika-and-Vijay-Devarakonda

ఒకవైపు యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తుంటే, మరోవైపు ఆయ‌న త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ కూడా వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. “దొర‌సాని” చిత్రంతో ఆనంద్ హీరోగా త‌న డెబ్యూ మూవీతో జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలంగాణ నేప‌థ్యంలో ఎమోష‌నల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఆర్ మ‌హేంద్ర అనే కొత్త దర్శకుడు తెర‌కెక్కిస్తున్నారు. రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సురేష్‌ బాబు సమర్పణలో పెళ్లి చూపులు కో ప్రొడ్యూసర్ యష్ రంగినేని – మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌రో నెల‌లోనే సినిమా విడుద‌ల కానున్న నేప‌థ్యంలో చిత్రానికి వినూత్నంగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌ర‌పాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాజ‌శేఖ‌ర్ కూడా దొర‌సాని మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగం అవుతార‌ని తెలుస్తుంది. మరి విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఎంతమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి.

Related posts