telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వరుణ్ తేజ్ కి హరీష్ శంకర్ ఛాలెంజ్ … కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా..!

Harish-Shankar

హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది..‘‘కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా నా బాల్య మిత్రుడు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటాను. హైదరాబాద్‌లోని ప్రతీ ఒక్కరూ హరిత హారంను సపోర్ట్ చేయాలి. వర్షపాతానికి, పర్యావరణ సంక్షేమానికి ఇది ఎంత మంచి పథకమో మీకు తెలుసు. సాధారణంగా మాకు సినిమా ఫంక్షన్లకు వెళ్లడం అలవాటు. కానీ ఇలా సామాజిక స్పృహ ఉన్న కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. కేసీఆర్‌కు హ్యాపీ బర్త్‌డే. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. గ్రీన్ ఛాలెంజ్ ప్రోగ్రామ్‌కు నేను హీరో వరుణ్ తేజ్‌ను నామినేట్ చేస్తున్నాను. వరుణ్.. ఈ ఛాలెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉండు’’ అని తెలిపారు.తెలంగాణ ప్రజానీకం ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకొంటోంది. 

Related posts