telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

డేటావార్ దర్యాప్తులో.. కెపీలో ఏపీ పోలీసులకు బ్రేక్!

Case field Telangana Police Guntur Dist.

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య డేటావార్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. డేటావార్ విషయమై రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య చిచ్చు రేగింది. ఏపీ ప్రభుత్వానికి చెందిన లబ్దిదారుల డేటా చోరీకి గురైందని వైసీపీ జనరల్ సెక్రటరీ విజయసాయిరెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు విషయంలో ఏపీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీస్‌‌గా పరిస్థితులు మారిపోయాయి. కూకట్‌పల్లి ఫార్చూన్‌ఫీల్డ్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ఏపీ పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విచారణ కోసం వెళ్లిన ఏపీ పోలీసులను వైసీపీ కార్యకర్తలు, తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.

జరుగుతున్న తతంగాన్ని వీడియో తీసి ఉన్నతాధికారులకు చేరవేద్దామంటే సెల్‌ఫోన్లు పగులకొడతామని వైసీపీ కార్యకర్తలు ఎదురుదాడి చేశారని ఏపీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఐటీ గ్రిడ్‌కు సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు కన్పించడం లేదంటూ ఆ సంస్థకు చెందిన ఆశోక్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న మాదాపూర్‌ సైబర్‌ క్రైం పోలీసులు వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు వెంటనే రంగంలోకి దిగడంపై మరోసారి ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు తేటతెల్లమయ్యాయని టీడీపీ ఆరోపణలు చేస్తోంది.

Related posts