telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బన్నీ, సుకుమార్ సినిమాకు కరోనా ఎఫెక్ట్…!

Allu-Arjun

ప్రముఖ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. బన్నీ సరసన రష్మిక హీరోయిన్‌గా నటిస్తోందట. శేషాచలం అడవుల నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దాదాపు సగ భాగం అటవీ నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కేరళలోని అడవుల్లో షూటింగ్ చేయాలనుకున్నారు. ఇప్పటికే లోకేషన్లను కూడా ఫైనలైజ్ చేసేశారు. అయితే కరోనా ప్రభావం కారణంగా అక్కడ షూటింగ్ చేయడం కుదరలేదట. కేరళ రాష్ట్రంపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే అక్కడ నుంచి షూటింగ్‌ను ఏపీకి మార్చినట్టు సమాచారం. మారేడుమిల్లి అడవుల్లో కొన్ని సీన్లు చిత్రీకరణ చేయాలని అనుకుంటున్నారట. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కేరళ వెళ్తారట.

Related posts