telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అమెరికాలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 21,551 పాజిటివ్‌ కేసులు

Corona

అమెరికాలో కరోనా వైరస్‌ చాపాకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 21,551 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో కరోనాతో 785 మంది మృతి చెందారు. ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 15,03,308గా ఉంది. మృతుల సంఖ్య 90,347కి చేరిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.

కోవిడ్-19తో ప్రపంచ మొత్తం నమోదైన మృతుల సంఖ్యలో మూడో వంతు అమెరికాలోనే ఉన్నాయి. ఆ దేశంలోని న్యూయార్క్‌లో ఇప్పటివరకు 3,51,371 పాజిటివ్‌ కేసులు, 28,339 మరణాలు నమోదయ్యాయి. న్యూజెర్సీలో 1,48,240 కరోనా కేసులు, 10,439 మరణాలు సంభవించాయి. ఇల్లినాయిస్‌లో‌ 96,485, మసాచుసెట్స్‌ లో 87,052,, కాలిఫోర్నియాలో 81,738 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుండగా చైనాలో గత 24 గంటల్లో కేవలం ఆరు కేసులే నమోదయ్యాయి.

Related posts