హైదరాబాద్ ఫార్మా, పరిశోధన సంస్థలకు కేంద్రంగా ఉందని, నెల రోజుల్లో హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. పీఎం కేర్స్ నిధులతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దేశంలో కేవలం రెండు వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రాలే ఉన్నాయి. హైదరాబాద్‌లో మూడో వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు కాబోతోందన్నారు. టీకా టెస్టింగ్ సెంటర్‌కు అవకాశం కల్పించిన ప్రధానికి మంత్రి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.
previous post