telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మరోసారి .. బ్యాంకులకు ఐదు రోజుల వరుస సెలవులు..

10 days bank holidays in april

ఈ నెల 26 నుంచి 30 వరకూ వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులకు సెలవలు రానున్నాయి. 26వ తేదీ గురువారం నుంచి రెండు రోజులపాటు దేశవ్యాప్త సమ్మె చేస్తామని బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి. ఆ తర్వాత 28వ తేదీ నాలుగో శనివారం, 29 ఆదివారం. ఆ రెండు రోజులూ బ్యాంకులు పని చేయవు. ఇక, ఈ నెల 30న బ్యాంకులకు అర్ధ సంవత్సర ముగింపు రోజు. ఆ రోజూ లావాదేవీలు ఉండవు. అక్టోబరు ఒకటో తేదీన బ్యాంకులు పని చేయనున్నాయి.

అక్టోబరు 2, గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు. బ్యాంకుల సమ్మె, అర్ధ సంవత్సర ముగింపు రోజుల్లో నెఫ్ట్‌ లావాదేవీలు ఉన్నా.. బ్యాంకుల్లో నగదు లావాదేవీలు ఉండవు. అంటే బ్యాంకు యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు వెళితే.. వరుసగా ఐదు రోజులపాటు వ్యాపార, నగదు లావాదేవీలు మాత్రమే కాదు.. ఉద్యోగుల జీతాలకూ ఇబ్బంది తప్పదు!

Related posts