telugu navyamedia
news political Telangana

టీఆర్ఎస్ ఏజెంట్‌గా గవర్నర్: వీహెచ్‌

Congress Hanmanth Rao Governor TRS agent

తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ టీఆర్ఎస్ ఏజెంట్‌గా పని చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. ఈ విషయమై కేంద్ర కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి గవర్నర్‌పై ఫిర్యాదు చేస్తామన్నారు. గురువారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భజన చేస్తున్నారని విమర్శించారు.

నరసింహన్‌ను వెంటనే మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై నిలదీయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఆర్డినెన్స్‌ తెచ్చి బీసీలకు అన్యాయం చేశారని వీహెచ్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు.

Related posts

ముగిసిన బీజేపీ .. సమావేశం.. కశ్మీర్ అంశంపై కీలక నిర్ణయం ..

vimala p

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. ట్విట్టర్ లో వెల్లడించిన బండ్ల గణేశ్

vimala p

ఓట్లు, సీట్లు చెబితే పరిశ్రమలు వస్తాయా.. సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు

vimala p