telugu navyamedia
telugu cinema news trending

“కలర్ ఫోటో” రిలీజ్ ఆహాలో…!

Color-Photo

సుహాస్ హీరోగా వస్తున్న”కలర్ ఫోటో” చిత్రం కూడా ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే జెర్సీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజూ పండగే సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటించి మంచి మార్కులు కొట్టేసిన సుహాస్ ఈ సినిమాతో హీరోగా మారుతున్నాడు. ఇందులో సుహాస్ సరసన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ కమెడియన్ సునీల్ విలన్ గా నటిస్తున్నాడు. సందీప్ రాజ్ దర్శకత్వం వహించగా, కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీతం అందించాడు. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘హృదయ కాలేయం’ సాయి రాజేష్ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా త్వరలో ఆహా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా విడుదల కాబోతుంది. భారీ సినిమాలనే కాకుండా కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను చూసి మరీ అల్లు అరవింద్ కొనుగోలు చేస్తూ చిన్న దర్శకులను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ‘కలర్ ఫోటో’ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. దాంతో సినిమాను ఆహా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను దీపావళి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ఆహా ప్లాన్ చేస్తుందట.

Related posts

“బుట్టబొమ్మ”కు ఫిదా అయిన ఏక్తాకపూర్ తనయుడు

vimala p

మజిలీ.. టీజర్..

vimala p

మూడవ వన్డేలో టీమిండియా ఆర్మీ క్యాప్‌ ధారణ .. రాజకీయం చేస్తున్నారన్న పాక్ .. !

vimala p