telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ముర్మును రాష్ట్రపతిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది- సీఎం జ‌గ‌న్‌

*ద్రౌపది ముర్ముకు సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపిన సీఎం జ‌గ‌న్‌
*మంగ‌ళ‌గిరిలో సీకే కన్వెన్షన్ సెంట‌ర్‌లో స‌మావేశం
*మంగళగిరి సీకే కన్వెన్షన్‌కు చేరుకున్న ముర్ము, సీఎం జగన్
*వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం
*ముర్మును రాష్ట్రపతిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంద‌న్న సీఎం

సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ సీఎం జ‌గ‌న్ తెలిపారు.. మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ద్రౌపది ముర్ముకు వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

రాష్ట్రపతిగా గిరిజన మహిళను గెలిపించుకుందామని సూచించారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముర్ముకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు..

రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన మహిళకు అవకాశం లభించింది. తొలి నుంచి వైసీపీ సామాజిక న్యాయాన్ని పాటిస్తుందని చెప్పారు. తొలి నుంచి వైసీపీ సామాజిక న్యాయాన్ని పాటిస్తుందని చెప్పారు. కాబట్టి, సహృదయంతో పార్టీ నిర్ణయాన్ని బలపర్చాలని పార్టీ ప్రతినిధులను సీఎం జగన్‌ కోరారు. ఒక్క ఓటు కూడా వృథా కాకూడదనితెలిపారు

అంతేకాదు ఎన్నికలకు ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తామని జగన్ పేర్కొన్నారు మాక్‌పోలింగ్‌లో పాల్గొన్న తర్వాతే ఓటింగ్‌కు వెళ్లాలని సభ్యులకు సూచించారు. ఎమ్మెల్యేలు వచ్చి ఓటు వేసేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్యానించారు.

ఎంపీల తరపున విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు బాధ్యతలు తీసుకుంటారని, అలాగే విప్‌లు, మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Related posts