telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చియాన్ విక్రమ్ కు తాతగా ప్రొమోషన్

vikram

కోలీవుడ్‌ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కు రియల్ లైఫ్ లో తాతగా ప్రొమోషన్ వచ్చింది. విక్రమ్‌, శైలజా బాలకృష్ణన్‌ దంపతుల కూతురు అక్షిత నవంబర్‌ 9న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటికే విక్రమ్‌ కుటుంబ సభ్యులు ప్రకటించగా… దర్శకుడు అజయ్ ఙ్ఞానముత్తు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ”చియాన్ విక్రమ్‌ సర్‌ కొత్త అవతారానికి కంగ్రాట్స్‌. మీరు కచ్చితంగా కూలెస్ట్ గ్రాండ్ ఫాదర్ అవుతారని నాకు తెలుసు. మీ కుటుంబం మొత్తానికి అభినందనలు. కొత్త పాపకు వెల్‌కమ్‌” అని అజయ్‌ కామెంట్ పెట్టారు. కాగా ప్రస్తుతం విక్రమ్‌, అజయ్‌ దర్శకత్వంలో కోబ్రాలో నటిస్తుండగా, ఆ తరువాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించనున్నారు. ఈ మూవీలో ధ్రువ్‌ విక్రమ్‌ కూడా కనిపించనున్నారు. వీరిద్దరు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మొదటి చిత్రం ఇదే కాగా.. దీనిపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Related posts