telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరు ఈ పాటని ఎంతలా ఇష్టపడుతున్నాడంటే… మనవరాలితో కలసి…

chiru

ఇటీవల కాలంలో తాను ఓ పాటను బాగా ఎంజాయ్‌ చేస్తున్నానని నిన్న ట్విటర్‌లో పేర్కొన్న మెగాస్టార్ నేడు ఆ వివరాలు వెల్లడించారు. ఖైదీ నంబర్‌ 150 చిత్రంలోని ‘మిమ్మీ మిమ్మీమి.. ఇకపై ఓన్లీ యూ అండ్ మీ’ పాట తను చాలా సార్లు విన్నానని తెలిపారు. ఈ పాటను పిల్లలు కూడా చాలా ఇష్టపడతున్నారని చెప్పిన చిరు.. ఆ పాటను తన మనవరాలు నవిష్క ఎంతగా ఇష్టపడుతుందో తెలిపే వీడియోను షేర్‌ చేశారు. ఆ పాటను తిలకిస్తున్నప్పుడు నవిష్కతో కలిసి చిరు ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. ‘నేను మ్యూజిక్‌కు ఉన్న శక్తి గురించి ఎప్పుడూ ఆశ్చర్యపోతాను. ఈ పాటకు కేవలం ఏడాది చిన్నారి ఎలా ఎంజాయ్‌ చేస్తుందో చూడండి. డ్యాన్స్‌ చేయడానికి ప్రయత్నించడమే కాకుండా ఎంతో ఆనందాన్ని పొందుతుంది. పాటను మధ్యలో ఆపి, మళ్లీ ప్లే చేస్తూ.. తనకు ఆ పాట నిజంగా ఇష్టపడుతుందా అని చూశాను. ఈ పాట నాది కాబట్టి, అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్‌ నాకే’ అని చిరు పేర్కొన్నారు. కాగా చిరు మనవరాలు నవిష్క 2018 క్రిస్మస్ పండుగనాడు శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌ దంపతులకు జన్మించింది. ఈ పాపకు ‘నవిష్క’ అని నామకరణం చేశారు. నవిష్క అంటే నిత్య నూతనంగా ఉండటం అని అర్ధం.

Related posts