telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కన్నుల పండవగా ఐఫా-2019 వేడుక… ఉత్తమ నటీనటులుగా అలియా, రణవీర్ సింగ్

IIFA

మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం బుధవారం రాత్రి కన్నుల పండవగా జరిగింది. 2019 సంవత్సరానికి గాను “ఐఫా-2019” ఉత్తమ నటీనటులుగా అలియాభట్, రణవీర్‌సింగ్‌లు ఎంపికయ్యారు. “రాజీ” సినిమాలో అలియాభట్ ఉత్తమనటనకు ఐఫా ఉత్తమ నటి అవార్డు లభించింది. పద్మావత్ సినిమాలో తన అద్భుత నటనకు గుర్తింపుగా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కు ఐఫా అవార్డు వరించింది. ఈ అవార్డులను ముంబై నగరంలో వారు అందుకున్నారు. “అంధాధూన్” సినిమా దర్శకుడు శ్రీరాం రాఘవన్ కు ఉత్తమ దర్శకుడిగా ఐఫా అవార్డును ప్రదానం చేశారు.

ఐఫా బెస్ట్ డిబట్ మేల్ అవార్డును “ధడక్” నటుడు ఇషాన్ ఖట్టర్‌కు, ఐఫా బెస్ట్ డిబట్ ఫిమేల్ అవార్డును “కేదార్‌నాథ్” నటి సారాఅలీఖాన్ కు దక్కాయి. ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ఐఫా-2019 అవార్డు అలియాభట్, విక్కీ కౌశల్ లు నటించిన ‘రాజీ’ చిత్రానికి లభించింది.ఉత్తమ సహాయ నటుడిగా విక్కీ కౌశల్ (సంజూ), ఉత్తమ సహాయనటిగా అదితీరావు హైదరీ (పద్మావత్) ఐఫా ప్రత్యేక అవార్డులు దీపికా పదుకోన్ (చెన్నై ఎక్స్‌ప్రెస్), రణబీర్ కపూర్ (బర్ఫీ), రాజ్ కుమార్ హీరానీ (త్రీఇడియట్స్), ప్రీతం (ఏ దిల్ హై ముష్కిల్) లకు లభించాయి. “కహోనా ప్యార్ హై” చిత్రానికి గత 20 ఏళ్లలో ఉత్తమ చిత్రంగా ప్రత్యేక ఐఫా అవార్డు లభించింది. ఉత్తమ నృత్య దర్శకురాలిగా సరోజ్ ఖాన్, ఉత్తమ కమేడియన్ గా సయ్యద్ ఇస్తిఖ్ అహ్మద్ లకు అవార్డులు వరించాయి. ఉత్తమ కథకులుగా శ్రీరాం రాఘవన్, పూజాలాథా సూర్తి, అర్జిత్ బిశ్వాస్, యోగేష్ చాందేకర్, హేమంత్ రావులు ఐఫా అవార్డులు పొందారు. ఉత్తమ సంగీత దర్శకులుగా అమాల్ మల్లిక్, గురు రంథ్వా, రోచక్ కోహ్లీ, సౌరభ్ వైభవ్, జాక్ నైట్ లు, ఉత్తమ పాటల రచయితగా అమితాబ్ భట్టాచార్య (ధడక్), ఉత్తమ గాయనీ గాయకులుగా హర్షదీప్ కౌర్, విభా సరాఫ్ ( రాజీ సినిమాలోని దిల్ బారో పాట), అర్జిత్ సింగ్ (రాజీలోని ఏ వతన్ పాట)కు లభించాయి.ఈ ఐఫా అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్, టాలీవుడ్ తారలు మెరిశారు. పలువురు సినీ తారలు తమ నృత్యంతో అలరించారు.

Related posts