telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఛార్మి ఇంట విషాదం… హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

charmi

టాలీవుడ్ హీరోయిన్, నిర్మాత ఛార్మి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఛార్మి అత్త ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. ఈ మేరకు ఆమె ఫోటోను పోస్ట్ చేస్తూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా భావోద్వేగపూరిత సందేశం పోస్ట్ చేసింది ఛార్మి. మీరు లేరని తెలిసి మాటలు రావడం లేదంటూ ఎమోషనల్ అయింది. ”ఇక మీరు లేరు అనే మాటే వినలేకపోతున్నా.. కానీ జీవితంలో జరిగేది జరగక మానదు. నిన్ననే మనం చివరగా వీడియో కాల్‌లో మాట్లాడుకున్నాం. కానీ అదే చివరిది అవుతుందని భావించ లేదు. మీరు లేరని తెలిసి మాటలు రావడం లేదు.. పైన స్వర్గంలో కూడా నీకు నచ్చినట్టుగా వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటావని అనుకుంటున్నాను. పైన ఉన్న అప్పితో కలిసి ఎంతో అమూల్యమైన సమయాన్ని గడుపుతావని ఆశిస్తున్నాను. నిన్ను, నీ చిరునవ్వును మిస్ అవుతున్నా. నా ప్రియమైన ఆంటీ నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా” అని పేర్కొంటూ మెసేజ్ పోస్ట్ చేసింది ఛార్మి.

Related posts