telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

దాదాపు ఖరారైన.. చంద్రబాబు టీం.. !!

TDP Candidate withdraw Badwel

తెలుగుదేశం పార్టీ లోక్‌సభ నియోజక వర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షలు ముగిసాయి. 25 లోక్‌సీట్ల పరిధిలోని 175 అసెంబ్లీ స్థానాలపై సమీక్షలు జరిగాయి. ప్రజాభిప్రాయం సర్వే నివేధికల ఆధారంగా అభ్యర్థులను చంద్రబాబు దాదాపుగా ఖరారు చేశారు. ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మళ్లి సత్తెనపల్లి నుంచే బరిలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచే గెలిచిన ఆయన గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న నరసరావుపేట అసెంబ్లీ స్థానం వ్యవహారాలు కూడా చూస్తున్నారు. దీనితో ఈ రెండింటిలో ఈ దఫా ఆయన ఎక్కడ పోటీ చేస్తారన్నది ఆసక్తి కలిగించింది. నరసారావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాల సమీక్ష జరిగగా సత్తెనపల్లిలో మెజారిటీ నేతలు కోడెల పేరు సూచించారు.

ఆయన కాని పక్షంలో తెలుగు యువనేత నాగ మల్లీశ్వరరావుకు అవకాశం ఇవ్వాలని కొందరు నేతలు కోరారు. నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబు ఈ సీటుపై ఆశక్తి వ్యక్తం చేసినా.. ఆయన పేరు అభిప్రాయ సేకరణలో పెద్దగా ప్రస్తావన రాలేదని సమాచారం. కోడెలను ఇక్కడే పోటీ చేయించాలని అందరూ కలిసి తీర్మానం చేశారు. మరోవైపు నరసారావుపేట లోక్‌సభ స్థానానికి కోడెల పేరు పరిశీలించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన మాత్రం అసెంబ్లీకి పోటీ చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. వీటన్నింటిపై చంద్రబాబుతో భేటీలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

ఈ లోక్‌సభ పరిధిలో నాలుగు సీట్లలో టీడీపీ అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. అరకు లోక్ సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానల్లో నాలుగు చోట్ల స్పష్టత వచ్చినట్లు సమాచారం. పాడేరులో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేరు ఖరారైంది. సాలూరులో మాజీ ఎమ్మెల్యే భాంజుదేవ్ పేరును చంద్రబాబు ప్రకటించారు. కురుపాం నుంచి శత్రుచర్ల విజయరామరాజు భార్య పేరును గతంలో నిర్ణయించారు. ఆమె స్వస్థలం ఒడిశా. అక్కడ ఆమె కుటుంబం ఎస్టీ జాబితాలో లేకపోవడంతో ఆమె పేరును పక్కనపెట్టారు.

తాజాగా మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు కుమార్తె పల్లవి పేరు ప్రతిపాదనకు వచ్చింది. పార్వతీపురం సిట్టింగ్ ఎమ్మెల్యే చిరంజీవుల పేరును కొందరు ప్రతిపాదించగా మరికొందరు వ్యతిరేకించారు. ప్రత్యామ్నాయంగా మాజీ ఎమ్మెల్యే జయమణి పేరు తెరపైకి వచ్చింది. పాలకొండ అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం కుదరలేదు. అరకు ఎంపీ స్థానానికి కిషోర్ పేరు ఖరారు అయినట్లు భావిస్తున్నారు.

Related posts