telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం నిరంకుశ వైఖరి: లక్ష్మణ్‌

bjp leader lakshman on trs power agreements

ఆర్టీసీ కార్మికులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరంకుశ వైఖరి వహిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సమయం‍లో సీఎం కేసీఆర్‌ స్వలాభం కోసం చాలా మాటలు చెప్పారని, అధికారంలోకి వచ్చాకా అన్నీ మర్చిపోయారని మండిపడ్డారు. ర్టీసీ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమ్మె చేస్తున్న కార్మికులపై చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డారు.

పాత బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోడం వల్లనే ఆర్టీసీ నష్టాల్లో ఉందని పేర్కొన్నారు. నెలక్రితం సమ్మె నోటీసులు ఇస్తే.. ప్రభుత్వం కనీసం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రైవేయిటీకరణ చేయడం కోసం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని లక్ష్మణ్‌ ఆరోపించారు. కార్మికుల పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కార్మికులను వీధులపాలు చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

Related posts