telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయంపై కేసీఆర్ సమాధానం చెప్పాలి.. దత్తత్రేయ డిమాండ్

BANDARU DATTATREYA

కొత్త మున్సిపల్ బిల్లుపై తెలంగాణ గవర్నర్ నరసింహన్ అభ్యంతరం చెప్పడం సంతోషకరమని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దత్తాత్రేయ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ బిల్లుపై గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేయటం ప్రజాస్వామిక విజయం అని అన్నారు. .దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు, ఎన్నికలు కూడా అలాగే నిర్వహించాలని అనుకుందని ప్రభుత్వ తీరుపై దత్తాత్రేయ నిప్పులు చెరిగారు.

రాజ్యాంగ విరుద్ధమైన ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని దత్తత్రేయ డిమాండ్ చేశారు. మున్సిపల్ చట్టం విషయమై ఇటీవలె గవర్నర్‌ను కలిశామని, బిల్లును వెనక్కి పంపించాల్సిందిగా కోరామన్నారు. ఎన్నికల సంఘం అధికారాలను కొత్త మున్సిపల్ చట్టం హరిస్తోందని ప్రభుత్వానికి గవర్నర్ చెప్పడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Related posts