శ్రీశైలం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డా రాజేశేఖర్‌రెడ్డి టిక్కెట్టు దక్కించుకొన్నారు. అయితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానని బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రకటించారు. కుటుంబ పరిస్థితుల వల్ల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని బుడ్డా తెలిపారు. తన సోదరుడైన శేషారెడ్డికి శ్రీశైలం టికెట్ ఇవ్వాలని బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ తన తమ్ముడు శేషారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరిన బుడ్డా తమ్ముడి కోసం సీటు త్యాగం చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఈ స్థానం నుండి ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై చంద్రబాబునాయుడు కసరత్తు నిర్వహిస్తున్నారు.
శ్రీశైలం నుండి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయనే విషయమై చంద్రబాబునాయుడు ఆరా తీస్తున్నారు. బుడ్డా శేషిరెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డితో పాటు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని టీడీపీ అదిష్టానం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.
రాత్రిపూట రసాయనాలను వదిలేస్తున్నారు: రేవంత్ రెడ్డి