telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా కారణంగా బిగ్ బాస్-4 ప్లాన్ ఛేంజ్

star maa promo on bigg boss 3

లాక్‌డౌన్ కారణంగా ఏకంగా రెండున్నర నెలలపాటు అన్ని రకాల ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌పై కరోనా ప్రభావం పడింది. ఇటీవలే ప్రభుత్వం నుంచి షూటింగ్స్‌కి అనుమతి లభించిన నేపథ్యంలో బిగ్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 కోసం కసరత్తులు ప్రారంభమయ్యాయని సమాచారం. అయితే రోజురోజుకూ కరోనా ఉదృతి ఎక్కువవుతున్న కారణంగా బిగ్‌బాస్ సీజన్- 4లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బిగ్‌బాస్ హౌస్ మొత్తాన్ని ఎలా మెయిన్‌టైన్ చేయాలనే దానిపై ప్రణాళిక రూపొందిస్తున్నారట బిగ్‌బాస్ నిర్వాహకులు. ఈ సారి బిగ్‌బాస్ సీజన్- 4 ను కేవలం 50 రోజుల్లోనే ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు ప్ర‌తి పార్టిసిపెంట్‌కి సెపరేట్ బాత్రూమ్స్‌, వాషింగ్ మెషీన్స్ ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోనున్నారని, ఈ మేరకు బిగ్‌బాస్ హౌస్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నార‌ని టాక్. గత సీజన్ బిగ్‌బాస్- 3 వంద రోజుల పాటు రన్ అయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో పార్టిసిపెంట్స్ గొడవలు, ఆట- పాట, బిగ్‌బాస్ ఇచ్చే టాస్కులు అన్నీ హైలైట్ అయ్యాయి. మరి ఈ సారి చూస్తే ఆ పరిస్థితులు కనిపించడం లేదు. జులై నెలలో బిగ్‌బాస్ సీజన్- 4 గురించి పూర్తి క్లారిటీ రానుందని తెలిసింది.

Related posts