telugu navyamedia
క్రీడలు

క్రికెటర్ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్… త్రుటిలో తప్పిన ప్రమాదం

litan-das

బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో లిటన్ దాస్ భార్య దేవశ్రీ బిశ్వాస్ సంచితకి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. టీ పెట్టేందుకని వంట గదిలోకి వెళ్లిన ఆమె గ్యాస్ స్టవ్ ఆన్ చేయగానే సిలిండర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. ముఖాన్ని రక్షించుకునే క్రమంలో చేతులు అడ్డం పెట్టుకోవడంతో తీవ్ర గాయాలైనట్టు కుటుంబసభ్యులు తెలిపారు. పేలుడు ధాటికి కిచెన్ కేబినెట్ కూలి ఆమెపై పడడంతో కాళ్లకి, చేతులకి, ముఖానికి గాయాలయ్యాయి. ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగు చూసింది. 2019 ప్రపంచకప్ తర్వాత లిటన్ దాస్, దేవశ్రీల వివాహం జరిగింది.

Related posts