telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

  పారితోషికం విషయంలో బాలయ్య తగ్గనంటున్నాడా ?

Tdp mla Balakrishna apologized journalists

‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న హిట్ కాంబినేషన్ బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను ఆరేళ్ళ విరామం అనంతరం మరో సినిమా చేయబోతున్నారు. అయితే బోయపాటి ఈసారి బాలయ్య సినిమాకి డివోషనల్ టచ్ ఇవ్వబోతున్నాడట. ఇటీవల కాలంలో వరుస పరాజయాలు ఎదురైనా పారితోషికం విషయంలో బాలకృష్ణ తగ్గేది లేదంటున్నారట. తెలుగునాట ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోల మార్కెట్ ఒడిదుడుకులకి లోనవుతోంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోలకి భారీగా ఫ్యాన్ బేస్ ఉన్నా వారి సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించే దాకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఎఫెక్ట్ వారి పారితోషికాలపై పడుతోంది. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న బోయపాటి సినిమా కోసం బాలకృష్ణ రూ.9 కోట్లు అందుకోబోతున్నారట. బాలయ్య తన రేంజ్ సక్సెస్ అందుకొని చాలా కాలం అవుతోంది. ఇక ఈ నందమూరి సీనియర్ హీరో చివరగా కనిపించిన ‘రూలర్’ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా విఫలమైంది. దీనికి తోడు ‘వినయ విధేయ రామ’ లాంటి డిజాస్టర్‌తో బోయపాటి కూడా సక్సెస్ ట్రాక్‌లో లేడు. ఇలా హీరో, డైరెక్టర్ విజయాలకి దూరంగా ఉండటంతో ఈ  క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో కమర్షియల్స్ క్యాలుక్యులేషన్స్ వచ్చి చేరాయట. ఈ మూవీ అటు బాలయ్యకు, ఇటు బోయపాటికి ఎంతో కీలకం కానుంది. ముఖ్యంగా బాలయ్య కమర్షియల్ సక్సెస్ అందుకుని బాక్సాఫీస్ బొనాంజా అనిపించుకోకపోతే రానున్న కాలంలో మార్కెట్ మరింత జారిపోయే ప్రమాదం ఉంది.

Related posts