telugu navyamedia
business news culture news

ఇక పై ఐఫోన్లను అద్దెకు తీసుకోవచ్చు?

cell phone

ఇకపై ఆపిల్ ఐఫోన్ ఐఫోన్లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. నెలకు కొంత మొత్తం చెల్లించి మీకు కావల్సినంత కాలం పాటు ఐఫోన్లను అద్దెకు తీసుకోవచ్చు. ఆ తరువాత ఏదైనా కొత్త ఐఫోన్ రిలీజ్ అయితే దాన్ని మళ్లీ రెంట్‌కు తీసుకోవచ్చు. ఆపిల్ సంస్థ త్వరలో ఐఫోన్లను అద్దెకు ఇచ్చే సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది.

ఐఫోన్లను అద్దెకు తీసుకునేవారు నెల నెలా ఐక్లౌడ్, ఐట్యూన్స్ వంటి సర్వీసులకు కూడా అద్దె చెల్లించేలా ఆపిల్ ఓ వినూత్నమైన కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తుందని సమాచారం. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఇప్పటికే ఈ విషయంపై సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే ఐఫోన్ల రెంటల్ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related posts

భారీ నష్టాలలో .. స్టాక్ మార్కెట్లు..

vimala p

టీడీపీ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన బుద్ధా వెంకన్న

vimala p

సాహసకృత్యాలు దేశాన్ని ముందుకు నడిపించలేవు: ప్రణబ్ ముఖర్జీ

vimala p