telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దర్శకనిర్మాతలు అనుష్కను పట్టించుకోవడం లేదా ?

Anushka

దక్షిణాదిలో తెలుగు, తమిళ్‌, మళయాళం, కన్నడ సినిమా రంగాల్లో అందరు స్టార్ హీరోలతో నటించి హిట్లు కొట్టిన ఘనత అనుష్కదే. ఏకంగా 14 సంవత్సరాల పాటు సౌత్‌ను ఏలేసిన ఆమె స్టార్ హీరోయిన్‌. 2005లో “సూప‌ర్” సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ క‌న్న‌డ కస్తూరి ఆ త‌ర్వాత సుమంత్ “మ‌హానంది”లో న‌టించింది. ఈ రెండు సినిమాలు పెద్ద‌గా క్రేజ్ తీసుకురాక‌పోయినా “విక్ర‌మార్కుడు”తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఆ త‌ర్వాత 2009లో వ‌చ్చిన “అరుంధ‌తి”తో అనుష్క టాప్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత ‘రుద్రమదేవి’ తన రాజసాన్ని ఒలకబోసింది. “అరుంధ‌తి” లాంటి సినిమా త‌ర్వాత వెంట‌నే “బిల్లా”లో బికినీ వేసిన ఘ‌న‌త అనుష్క ఒక్క‌రికే సొంతం. ఆ త‌ర్వాత “పంచాక్ష‌రి”, “రుద్ర‌మ‌దేవి”, “భాగ‌మ‌తి”, “సైజ్ జీరో” లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది అనుష్క‌. మ‌రోవైపు “సింగం” లాంటి సినిమాల్లో హీరోయిన్‌గానూ గ్లామ‌ర్ ఒల‌క‌బోసింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “బాహుబలి”తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. ‘భాగమతి’ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ భామ ఈ యేడాది ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ‘ఝన్సీ లక్ష్మీబాయి’గా కాసేపు కనిపించి ప్రేక్షకులను అలరించింది. టాప్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక సైలెంట్‌గా ఉంటోంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమా ‘నిశ్శబ్ధం’. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. అంతకుముందు సైరాలో ఝాన్సీ లక్ష్మీబాయ్‌ క్యారెక్టర్లో నటించింది. తెలుగు ప్రేక్షకులను మెప్పించింది అనుష్క. సైరా తరువాత అనుష్కకు అవకాశాలు పెరుగుతాయని.. ఇక ఆమెకు తిరుగేలేదని అభిమానులు భావించారు. కానీ ఒకే ఒక్క సినిమా నిశ్శబ్ధం అనే సినిమాలో నటించిన అనుష్క ఇప్పుడు నిజంగానే నిశ్శబ్ధమైపోయారు. డైరెక్టర్లు, నిర్మాతలెవరు అస్సలు అనుష్కను సంప్రదించకపోవడంతో అనుష్క కూడా సినిమా అవకాశాలు వచ్చినప్పుడు చూద్దామని.. అంతవరకు సైలెంట్‌గా ఉందామని నిర్ణయించుకున్నారట. తనకు తగ్గ క్యారెక్టర్ వస్తే మాత్రం డైరెక్టర్లే సంప్రదిస్తారని.. అంతేతప్ప తాను వెళ్ళి వారిని కలవాల్సిన అవసరం లేదంటోందట స్వీటీ అనుష్క.

Related posts