telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనసూయ అక్కడ సర్జరీ చేయించుకుందా… అసలు నిజం ఇదే…!

Anasuya

తెలుగులో వస్తున్న “జబర్ధస్త్” కామెడీ షోతో యాంకర్ అనసూయ ఎంత క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఒకవైపు బుల్లితెర షోలు, మరోవైపు సినిమాలు అంటూ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన అనసూయ ప్రస్తుతం వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది. అనసూయ యాంకర్ గా పాపులారటీతో పాటు కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ పెళ్లి చేసుకుని, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన త‌ర్వాత కూడా అన‌సూయ‌ గ్లామ‌ర‌స్ యాంక‌ర్‌గా రాణిస్తూ దూసుకుపోతోంది. ఇటీవలే అనసూయ ప్రధాన పాత్రలో నటించిన “కథనం” సినిమా విడుదలయింది. అయితే ఇండస్ట్రీలో రూమర్స్ కామన్. దానికితోడు ఆమెపై ఎప్పటికప్పుడు కొత్త గాసిప్పులు కూడా క్రియేట్ అవుతూనే ఉంటాయి. అలాగే ఆ మధ్య ఓ సంచలన గాసిప్ అనసూయపై వచ్చింది. ఇదే విషయంపై ఇప్పుడు ఈ భామ క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్యే దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డుల వేడుక గత వారం టెలివిజన్‌లో ప్లే అయింది. అప్పుడు అనసూయను కొన్ని కొంటె ప్రశ్నలు అడిగారు హోస్ట్ అలీ, మంచు లక్ష్మి. ఈ మధ్య కాలంలో నువ్వు నీపై విన్న మోస్ట్ క్రేజీ రూమర్ ఏంటి అని అడిగితే.. అనసూయకు అక్కడ సర్జరీ అయిందట.. అంటూ నాపై రాసిన ఓ రూమర్ భలే అనిపించింది అని చెప్పింది అను. ఇంతకీ ఎక్కడా అని అలీ అడిగే సరికి కాస్త సిగ్గు పడింది అనసూయ. కొన్ని రోజుల కింద అనసూయ సర్జరీ గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలే వచ్చాయి. ఆమె నడుముకు ఆపరేషన్ చేయించుకుందని.. బాగా లావు అయిపోయేసరికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని వార్తలు వచ్చాయి. తనపై రాయడానికి ఏ వార్తలు లేక చివరికి ఇలా కొత్త వార్తలు పుట్టించారా అంటూ అప్పట్లో అనసూయ దీనిపై సీరియస్ కూడా అయింది. ఇప్పుడు ఇదే రూమర్ తనకు క్రేజీగా అనిపించింది అంటూ సైమా వేడుకలో అందరిముందు చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

Related posts