telugu navyamedia
సినిమా వార్తలు

“పాకిస్తాన్ జిందాబాద్” అంటున్న హీరోయిన్

Mahira-Khan

పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం ఉగ్రవాదులపై మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 300కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే పాకిస్తాన్ హీరోయిన్ మహీరాఖాన్ మాత్రం “పాక్ ని రెచ్చగొట్టి భారత్ తప్పు చేసింది. సర్జికల్ స్ట్రైక్ వంటి చర్యలతో యుద్ధానికి స్వాగతం పలికినట్టే. భారత్-పాక్ ల మధ్య సాధారణ పరిస్థితిలు రావాలి… పాకిస్తాన్ జిందాబాద్” అంటూ ట్వీట్ చేసింది మహీరాఖాన్. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో మనుమరాలు ఫాతిమా భుట్టో చేసిన ట్వీట్ కు మహిరా ఈ విధంగా స్పందించింది. షారుఖ్ ఖాన్ నటించిన “రాయిస్” సినిమాలో హీరోయిన్ గా నటించింది మహిరా. 2017లో ఈ సినిమా విడుదలైంది. అయితే సోషల్ మీడియాలో మహీరా చేసిన కామెంట్స్ పై కొంతమంది మద్దతు తెలపగా… మరికొంతమంది మాత్రం మండిపడుతున్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అన్నప్పుడు ఇండియాకు వచ్చి బాలీవుడ్ లో జాబ్ అడుక్కోవడం దేనికి ? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇక ఈ క్రమంలోనే పాకిస్తాన్ లో భారత్ సినిమా విడుదలను నిషేధించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ సమాచారం మంత్రి ఫవాద్ చౌదరి ప్రకటించారు. అంతేకాదు మేడిన్ ఇండియా ప్రకటనల్ని కూడా నిషేధించాలని పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీకి సూచించారు. అయితే ఈ నిర్ణయం వల్ల భారతీయ చిత్ర పరిశ్రమకు ఎలాంటి నష్టం ఉండబోదని, పాకిస్థాన్‌కే నష్టమని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్థాన్‌కు వినోదపన్ను రూపంలో సుమారుగా రూ.102 కోట్లు వసూలవుతోంది. ఈ నిర్ణయం వలన ఆ ఆదాయానికి గండి పడుతుంది. ఇక ఇండియాలో లుడా పాకిస్తాన్ నటీనటులపై నిషేధం విధించిన విషయం విదితమే.

Related posts