telugu navyamedia
సినిమా వార్తలు

బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్… గర్భవతి అయిన స్టార్ హీరోయిన్

Amy Jackson says she is Pregnant and Expecting her First Child in October

ఐ, 2.0 లాంటి భారీ సినిమాల్లో నటించిన గ్లామర్ డాల్ అమీ జాక్సన్ స్వయంగా తాను గర్భవతిని అని ప్రకటించేసింది. ఈ హాట్ బ్యూటీ గత కొన్ని రోజులుగా మల్టీ మిలియనీర్ జార్జ్ పనాయిటౌతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే జార్జ్ తో అమీ ఎంగేజ్మెంట్ జరిగింది. జార్జ్ తో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అక్టోబర్ లో తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది.

గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట 2019 జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. జార్జ్ బ్రిటన్ కు చెందిన ఓ కుబేరుడు. హిల్టన్, పార్క్ ప్లాజా, డబుల్ ట్రీ లాంటి లగ్జరీ హోటల్స్ ను నిర్వహిస్తున్నాడు జార్జ్. ఇక అమీ జాక్సన్ విషయానికొస్తే “మద్రాసు పట్టణం” చిత్రంతో సినిమాల్లోకి తెరంగ్రేటం చేసింది. తరువాత హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటించింది అమీ. చివరిగా సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన “2.0” చిత్రంలో నటించింది అమీ. ప్రస్తుతం ఆమె నటించిన కిక్-2 చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

Related posts