telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అధికారపక్షం తరపున పోలీసులు పనిచేయొద్దు: సుజనా చౌదరి

4 directors arrested from sujana chowdary offices

అధికారపక్షం తరపున పోలీసులు పనిచేయొద్దని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. అమరాతి రైతులపై పోలీసులు అత్యుత్సాహం తగదని, కక్ష సాధింపుచర్యలకు దిగడం సరికాదని హెచ్చరించారు. “సేవ్ అమరాతి” “సేవ్ ఆంధ్రప్రదేశ్” ట్యాగ్ లైన్స్ తో ఓ ట్వీట్ సుజనా, ఈ సందర్భంగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. అరెస్టు చేసిన రాజధాని రైతులపై సెక్షన్ 307 అమలు చేసిన విషయాన్ని సుజనా చౌదరి వద్ద ఓ రైతు భార్య ప్రస్తావించగా మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేద్దామని

రైతులకు నష్టం జరగకుండా చూసే బాధ్యత తమదని హామీ ఇచ్చారు.రాజధాని తరలించొద్దంటున్న తనపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, అమరావతి ప్రాంతంలో తనకు భూములు ఉన్నాయని ఆరోపిస్తున్నారని అన్నారు. రైతులు శాంతియుతంగా ఉద్యమం కొనసాగించాలని, ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ స్లోగన్ తో రైతులు తమ నిరసనలు తెలపాలని సూచించారు. రాజధాని మార్చాలన్నది అంత తేలికకాదని, కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పారు.

Related posts