telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అల్లుడు అదుర్స్ నుండి కొత్త ఏడాది గిఫ్ట్…

బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లోకి హీరోగా అల్లుడు శ్రీను సినిమాతో పరిచయమైనా విషయం తెలిసిందే. తన మొదటి సినిమా నుంచే గొప్ప నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తనదైన కథల ఎంపికతో తెలుగు చిత్ర సీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో అల్లుడు అదుర్స్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రియల్ హీరో బిరుదు అందుకున్న సోనూ సూద్ కూడా కనపించనున్నాడు. ఈ సినిమా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన నభా నటేష్, అను ఇమాన్యుయల్ నటిస్తుండగా, జాతీయ స్తాయి నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్ర బృందం న్యూఇయర్‌ గిఫ్ట్‌గా తమ అభిమానులకు ఓ సరికొత్త అప్‌డేట్ అందించింది. సోనూ సూద్, శ్రీనివాస్ ఇద్దరు అల్లుడు అదుర్స్ టైటిల్‌కు చెరోపక్క నిలిబడి ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హీరో స్టైల్‌గా ఉన్నాడు. అంతేకాకుండా జనవరీ 15న సినిమా విడుదల కానున్నట్లు కూడా తెలిపారు. ఈ సినిమాపై అభిమానుల అంచనాలు బాగానే ఉన్నాయి. చూడాలి మరి సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా… వారిని మెప్పిస్తుందా… లేదా అనేది.

Related posts