కరోనా వైరస్‌కు తొలి వ్యాక్సిన్ తమదేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ పనితీరుపై పలు దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. ప్రపంచంలో ఏ దేశంలో వ్యాక్సిన్ విడుదలైనా తెప్పించుకునే ప్రయత్నాలు చేయవద్దని కేంద్రం రాష్ట్రాలకూ సూచించింది.
నిన్న నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సమావేశమైన కమిటీ వ్యాక్సిన్ పంపిణీ విధానంపై కీలక చర్చలు జరిపింది. వ్యాక్సిన్ లభ్యత, సరఫరా విధానం నీతి ఆయోగ్ అడిగి తెలుసుకుంది. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ట్రాక్ చేసేందుకు అందుబాటులోని వ్యవస్థలపైనా ఈ కమిటీ చర్చలు జరిపింది. కేంద్రం తరఫునే వ్యాక్సిన్ ఎంపికను చేయాలని రాష్ట్రాలకు సూచించింది.
పరారీలో ఉండాల్సిన అవసరం మా ఆయనకు లేదు: అఖిలప్రియ