telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు సాంకేతిక

వాట్స్ యాప్ లో కూడా… బ్లూ వెల్ తరహా ప్రమాదకర ఆటలు.. కేసు ఎదుర్కొంటున్న క్రికెటర్…

adult game from whatsapp makes issues

టెక్నాలజీ ఎంత పెరిగితే అంతగా ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇదో చిన్న సమస్య అయినప్పటికీ, దీని ప్రభావం మాత్రం తీవ్రంగా ఉండటం కలకలాన్ని రేపుతోంది. మొన్న బ్లూ వెల్, నేడు మరో అడల్ట్ గేమ్ అదికూడా వాట్స్ యాప్… దానికి ఒక యువతి బలైనట్టు సమాచారం. అందుకు ఒక క్రికెటర్ అతని స్నేహితులు ఈ ప్రమాదకరమైన ఆటను ఆడటం కారణంగా చెపుతున్నారు అధికారులు. వివరాలలోకి వెళితే… ఆస్ట్రేలియా యువ క్రికెటర్ అలెక్స్ హెప్ బర్న్, తన స్నేహితుడు జో క్లార్క్ తో కలిసి ఓ యువతిని రేప్ చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు కావడం కలకలం రేపింది. నిద్రిస్తున్న ఓ అమ్మాయిపై వీరు అత్యాచారానికి తెగబడ్డారన్నది ప్రధాన ఆరోపణ. ఇంగ్లాండ్ లోని వార్చస్టెర్ షైర్ కౌంటీ క్లబ్ కు ఆడుతున్న హెప్ బర్న్ ఓ వాట్స్ యాప్ గేమ్ లో గెలవాలన్న కసితో ఈ పని చేశాడని బాధితురాలి తరఫున వాదించనున్న న్యాయవాది మిరండా మూరే తెలిపారు.

తాను జో క్లార్క్ గదికి వెళ్లిన వేళ ఈ ఘటన జరిగిందని, ఇద్దరూ తనపై అత్యాచారం చేశారని బాధితురాలు వాపోయింది. ఈ వాట్స్ యాప్ ఆట నిబంధనల ప్రకారం, గ్రూప్ లోని వ్యక్తులు ఎంతమంది అమ్మాయిలను కలిశారో, ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుండాలి. నియమిత సమయం తరువాత, ఎవరు ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొంటే వారు విజేతగా నిలిచినట్టు. ఈ గేమ్ లో గెలవాలన్న ఆలోచనతో హిప్ బర్న్ ఈ పని చేశాడని మూరే తెలిపారు. కాగా, హెప్‌బర్న్ వాదన మాత్రం మరోలా ఉంది. తాను ఆ అమ్మాయి అంగీకారంతోనే సెక్స్‌ లో పాల్గొన్నానని అన్నాడు. ఆ సమయంలో యువతి నిద్రపోలేదని చెప్పాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

Related posts