telugu navyamedia
telugu cinema news trending

నెటిజన్ సలహాకు తాప్సి కౌంటర్

Taapsee

తెలుగులో “ఝుమ్మంది నాదం” సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలను చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. అయితే తాజాగా తాప్సీ ఢిల్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు చూసిన ముంబైకి చెందిన నెటిజన్ .. తమరు ముంబైలో ఉంటూ ఢిల్లీలో ఓటు వేయడమేంటని తాప్సీని ప్రశ్నించారు. ఆమె ఓటును ముంబైకు మార్చుకోవాలని సూచించారు. దీంతో నెటిజన్‌కు హీరోయిన్ తాప్సీ ఘాటుగా బదిలిచ్చారు. ‘‘నా పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ముంబై కంటే ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటా. ట్యాక్స్‌లు కూడా ఢిల్లీలోనే కడుతున్నా. నా పౌరసత్వంపై మీరు ఆలోచించడం మానేయాలి. మీరు చేస్తున్న సేవలపై మాత్రమే ఆలోచించుకోవాలి.’’ అని నెటిజన్‌కు తాప్సీ సూచించారు.

Related posts

పదేళ్ల బాలుడికి విమానంలోకి నో ఎంట్రీ… అలాంటి టీ షర్ట్ వేసుకోవడమే కారణమట…!

vimala p

వోడాఫోన్ సేవలు .. భారత్ లో ఇక లేనట్టేనా..

vimala p

మా అమ్మాయిని పెళ్లాడితే.. 2 కోట్లు ఇస్తా.. !

vimala p