telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మన్మథుడికి జోడిగా ఆ ఫేడవుట్ హీరోయినా ?

Nag

కింగ్ నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం “వైల్డ్‌ డాగ్‌”. ఎ.సి.పి విజయ్‌ వర్మ… ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌! తీవ్రవాదులపై మెరుపుదాడి చేసి… కాల్చి చంపడంలో ఆరితేరిన ఎన్‌ఐఎ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) ఆఫీసర్‌. చాలాసార్లు సీక్రెట్‌ ఆపరేషన్స్‌ నిర్వహించి, తీవ్రవాదుల్ని ఎన్‌కౌంటర్‌ చేయడంతో విజయ్‌ వర్మకు ‘వైల్డ్‌ డాగ్‌’ అనే పేరు వచ్చింది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అహిషోర్‌ సాల్మోన్‌ దర్శకుడు. ఈ సినిమాలో నాగార్జున వైల్డ్‌డాగ్‌ విజయ్‌ వర్మ అనే పోలీస్‌ అధికారిగా కనిపించబోతున్నారు. యథార్థ ఘటనల ఆధారంగా సృష్టించిన ఆయన పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. రహస్య పోలీస్‌ ఆపరేషన్‌లో విజయ్‌వర్మకు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్నది ఉత్కంఠను పంచుతుంది. తొలి షెడ్యూల్‌ పూర్తయింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ షానియల్‌ డియో అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించిన ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. నాగ్ కోసం టీం బాలీవుడ్ భామను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు దియా మీర్జా. హైదరాబాదీ అయిన దియా మీర్జా ముంబయిలో సెటిల్ అయ్యారు. బాలీవుడ్‌లో ఒకప్పుడు మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల దియా తన భర్తకు విడాకులు ఇచ్చేసి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈమెకు సంబంధించిన షూటింగ్ కూడా అయిపోయిందని తెలుస్తోంది.

Related posts