telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ పై రేణూదేశాయ్ కామెంట్స్

Renu-Desai

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ప్ర‌స్తుతం తెలుగు సీజ‌న్-3… నాగార్జున హోస్ట్‌గా 15మంది సెల‌బ్రిటీల‌తో జూన్ 21న మొద‌లైన ఈ కార్య‌క్ర‌మం విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. తొలి వారంలో హేమ ఎలిమినేట్ కాగా, రెండో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ట్రాన్స్‌జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి ఇంట్లోకి ప్ర‌వేశించారు. ఆసక్తికర టాస్కులతో ఆసక్తికరంగా సాగుతోంది బిగ్ బాస్. అయితే తాజాగా రేణుదేశాయ్ ప్రముఖ యాంకర్ ప్రేమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా క్రేజీ షో బిగ్ బాస్ పై రేణుదేశాయ్ కామెంట్స్ చేసింది. రేణు దేశాయ్, యాంకర్ ప్రేమ లైవ్ చాట్ లో ఉండగా ఓ అభిమాని బిగ్ బాస్ గురించి ప్రస్తావించాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ప్రారంభానికి ముందు రేణు దేశాయ్ కూడా ఈ షోలో పాల్గొనబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఆ వార్తలపై స్పందించిన రేణూదేశాయ్ తాను బిగ్ బాస్ లో పాల్గొనడం లేదని, కానీ హోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. తాజాగా బిగ్ బాస్ షోలో పాల్గొనవచ్చు కదా? అని అభిమాని ప్రశ్నించగా.. “బిగ్ బాస్ లో 24 గంటల పాటు కెమెరా ముందే ఉండాలి. నాకు అసలే మొహమాటం ఎక్కువ. అక్కడ ఉండలేను అని రేణు దేశాయ్ తెలిపింది. నేను బిగ్ బాస్ కు సరిపడే వ్యక్తిని కాదు. అకీరా, ఆధ్యని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేను.. అలాంటి 100 రోజులు ఎలా ఉండగలను?” అని రేణు దేశాయ్ తెలిపింది. నటిగా తన కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ ప్రస్తుతం రచయితగా, దర్శకురాలిగా రాణించేందుకు ప్రయత్నిస్తోంది. గత ఏడాది రేణు దేశాయ్ రెండవ వివాహం నిశ్చితార్థం కూడా జరిగింది.

Related posts