పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ “ఇస్మార్ట్ శంకర్” అద్భుతమైన కలెక్షన్లు సాధించి దూసుకుపోతుంది. ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. జూలై 18న విడుదల అయిన ఈ చిత్రం అదే క్రేజ్‌తో ముందుకు సాగింది. ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. “ఇస్మార్ట్ శంకర్” రిలీజ్ అయిన వారం రోజులకు “డియర్ కామ్రేడ్” విడుదల అయింది. ఒకటి పక్కా క్లాస్ అయితే.. మరొకటి పక్కా ఊరమాస్.. “ఇస్మార్ట్ శంకర్” రెండో వారంలోకి అడుగు పెట్టి వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌లోనే అమ్మి ఎక్కువ లభాలు పొందారు. నైజాంలో ఈ సినిమాను ఐదున్నర కోట్ల రేషియోలో ఇచ్చారు. రెండు వారాల్లో 12 కోట్ల రూపాయల షేర్ సాధించింది. అన్ని పోను 6 కోట్లు లాభం వచ్చింది. గుంటూరు, ఈస్ట్ లాంటి ప్రాంతాల మినహా.. అన్ని ఏరియాల్లోనే ఇదే క్రేజ్ కంటిన్యూ చేసింది. మరి 12 రోజుల వసూళ్లు ఏరియా వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ మరియు 12 రోజుల షేర్
నైజాం – రూ. 5.50 – రూ. 12.55
సీడెడ్ – రూ. 2.52 – రూ. 5
ఉత్తరాంధ్ర – రూ. 1.40 – రూ. 3.48
ఈస్ట్ – రూ. 1.05 – రూ. 1.83
వెస్ట్ – రూ. 0.90 – రూ. 1.53
గుంటూరు – రూ. 1.10 – రూ. 1.82
నెల్లూరు – రూ. 0.48 – రూ. 0.96
కృష్ణా – రూ. 0.95 – రూ. 1.82
వీడియో బయటపెట్టేముందు కాస్త ఆలోచించి పెట్టండి..