telugu navyamedia
telugu cinema news trending

సుశాంత్ మృతి కేసు సీబీఐకి… నిజాలు వెలుగులోకి వస్తాయంటున్నా రవీనాటాండన్

Raveena

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఫ్లాట్‌లో మరణించిన విషయం తెలిసిందే. సుశాంత్‌ది ఆత్మహత్య అని ముంబై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ముంబై, పాట్నా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మంగళవారం బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా సుశాంత్ తండ్రి కేకే సింగ్ అభ్యర్థన మేరకు సీబీఐ విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు బాలీవుడు నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును దర్యాప్తునకు స్వీకరించింది సిబిఐ. దీనిపై నటి రవీనా టండన్ హర్షం వ్యక్తం చేశారు. “సుశాంత్ మరణంపై ఇప్పటికే అనేకమంది అనేక రకాలుగా చెబుతున్నారు. అయితే ఆ మిస్టరీని త్వరగా ఛేదించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం సంతోషంగా ఉంది. దీనివల్ల నిజాలు కచ్చితంగా వెలుగులోని వస్తాయని అనుకుంటున్నాను. అదే జరిగితే అతడి కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులతో పాటు బాలీవుడ్ కూడా ఎంతగానో సంతోషిస్తుంది” అని రవీనా పేర్కొన్నారు. ఇక ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు ఆమె కుటుంబంపై గురువారం ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసింది సిబిఐ.

Related posts

“గద్దలకొండ గణేష్” మొదటి వారం వసూళ్లు

vimala p

నెటిజన్ సలహాకు తాప్సి కౌంటర్

vimala p

ఉపాసన కొత్త ఉద్యోగం… !?

vimala p