telugu navyamedia
andhra political

డేటాచోరీ కేసుపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు! 

hero shivaji comments Cm kcr
తెలుగు రాష్ట్రాల్లో దుమారం లేపుతున్న  డేటాచోరీ కేసుపై  ప్రముఖ సినీనటుడు శివాజీ ఘాటుగా స్పందించారు. ఈరోజు  విజయవాడలో  శివాజీ  మీడియాతో మాట్లాడుతూ డేటా దుర్వినియోగం అంటూ ఆరోపణలు చేస్తున్న పార్టీలన్నీ ఆ కోవకు చెందినవేనని ఆరోపించారు. డేటా చోరీ జరిగిందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
నాడు సమగ్ర కుటుంబ  సర్వే పేరుతో ప్రజల ఓట్లను వ్యూహాత్మకంగా తొలగించారని ఆరోపించారు. అప్పుడు కేసీఆర్ కు ఎన్నికల సంఘం సహకరించిందని ఆరోపించారు. ఈ విషయమై టీఆర్ఎస్ కు కేంద్రం పూర్తిగా సహకరించిందని పేర్కొన్నారు.  ఓట్ల తొలగింపుపై  కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి చేసిన ఫిర్యాదును ఎన్నికల సంఘం పట్టించుకోలేదని విమర్శించారు. ఓట్ల తొలగింపు వ్యవహారం తెలంగాణలో సాఫీగా సాగిపోయిందని అదే తరహాలో ఏపీలో చేయాలని కేసీఆర్ చూస్తున్నారని శివాజీ ధ్వజమెత్తారు. 

Related posts

జగన్‌ ప్రజా బలాన్ని చూసి పార్టీలోకి వలసలు: రోజా

ashok

ముగియనున్న గడువు.. రాజీనామా చేయనున్న మంత్రి

vimala p

విదేశాల్లో  తెలంగాణ బిడ్డలు గర్వించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం: ఎంపీ కవిత

ashok