telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ దురదృష్టకర సంఘటనతో బాధపడుతున్నా… లెబనాన్‌ పేలుడుపై మహేష్ బాబు

Mahesh

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని సంభవించిన పేలుళ్ళు ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఆ భారీ పేలుడు నగరాన్ని ధ్వంసం చేసింది. అగ్నిప్రమాదంగా మొదలైన సంఘటన భారీ పేలుడుకు కారణం అయ్యింది. ఓ గోడౌన్ లో దాచివుంచిన 2700 మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రేట్ భారీ పేలుడుకు కారణం అని తెలుస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం 100మంది మరణించగా, 4000 వరకు గాయాలపాలు అయ్యారు. ఇక ఈ ఘటనలో 2.5 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ పేలుడుకు ఎలా జరిగిందన్న విషయంపై విచారణ సాగుతోంది. ఈ పేలుడు తీవ్రత ఎంత ఉందంటే దాని శబ్దం 240 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ ద్వీపం వరకూ వినిపించింది. అయితే ఈ ఘటన పై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ”లెబనాన్ పేలుడు వినాశనాన్ని చూడటం ఖచ్చితంగా భయంకరమైనది. ఈ దురదృష్టకర సంఘటనతో బాధపడుతున్నా. ఈ ఘటనలో బాధితుల కోసం మరియు వారి కుటుంబాల కోసం నేను ప్రార్థనలు చేస్తున్నాను” అని తెలిపారు.

Related posts