నేడు రజినీకాంత్ నటించిన పేట చిత్రం విడుదల అయ్యింది. దీనితో పండగ చేసుకుంటున్న ఆయన అభిమానులు ముందుగా అనుకున్నట్టే, ఈ చిత్రం గతంలో తెరకెక్కించిన బాషాను మించిపోతుంది అంటుండటం విశేషం. ఇటీవలి కాలంలో వచ్చిన ‘కబాలీ’, ‘కాలా’, ‘2.0’… ఇవన్నీ పాత రజనీకాంత్ ను అభిమానులకు గుర్తు చేయలేకపోయాయనడంలో సందేహం లేదు. కానీ, ఈ ఉదయం విడుదలైన ‘పేట’ మాత్రం 1990 దశకంలో రజనీని గుర్తు చేసిందట.
నేటి ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పడగా, చిత్రం చూసిన వారు సినిమా అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బీజీఎం సూపరని అంటున్నారు. ఈ సినిమా రజినీకాంత్ స్టైల్ లో నడిచిన పక్కా మాస్ సినిమా అని, ‘బాషా’ను మించిపోయిందని చెబుతున్నారు. రజినీ కామెడీ టైమింగ్, ఫైట్లు, మాస్ పాటలు… అభిమానులకు కావాల్సిన వన్నీ ఉన్నాయని, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే హైలైట్ అని మరికొందరు ట్విట్టర్ లో స్పందిస్తున్నారు. చాలా కాలం తరవాత పాత తలైవా తిరిగి కనిపించాడని అంటూ ఆనందంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వైఎస్ జగన్ అండ్ కో ఇసుక నుండి తైలం తీయగల సమర్థులు: నారా లోకేశ్