కడపలో పసుపు సైనికుల హడావిడి చూస్తుంటే బెంగుళూరు ప్యాలెస్ లో టీవీలు బద్దలవుతాయి.
• తెలుగు దేశం పార్టీ బాడీ అయితే దానికి వెన్నెముక కార్యకర్తలు.
• ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వెన్ను వంచని పార్టీ తెలుగు దేశం పార్టీ. దానికి కారణం కార్యకర్తలు.
• గొంతుమీద కత్తిపెట్టి ప్రాణం తీస్తాం అని బెదిరించినా జై తెలుగు దేశం అని పలికిన చంద్రయ్య ఎంత గొప్ప కార్యకర్తో. అతనిని చూసి మనం గర్వపడాలి.
• కార్యకర్తలని మానసికంగా, క్రూరత్వంగా అవమాన పరిచి వేధించే సమయంలో రాష్ట్రంలో ఒక గుండె ధైర్యం అడుగు పెట్టింది. ఆ గుండె ధైర్యం పేరే యువగళం.
• రెండు సంవత్సరాల క్రితం యువగళం కడప జిల్లాలో అడుగు పెట్టింది.
• యువగళం మొదలుపెట్టిన తర్వాత కార్యకర్తలను అడ్డుకున్నారు. తెలుగు దేశం పార్టీ పోస్టర్లను చించేశారు, అర్థరాత్రి జీవోలు తీసుకొచ్చారు. తప్పుడు కేసులు పెట్టారు.
• యువగళంలో మైకులో మాట్లాడకుండా మైకు లాక్కున్నారు. చివరికి ప్రజలు జగన్ రెడ్డికి అసెంబ్లీలో మైక్ లేకుండా చేశారు.
• ఎన్ని కుట్రలు చేసినా వెనకడుగు వేయకుండా ముందుకుసాగి కార్యకర్తలకు, ప్రజలకు ధైర్యం చెప్పారు నారా లోకేష్.
• నాలుగు దశాబ్ధాలుగా పార్టీ క్రమశిక్షణతో నడుచుకుంటుందంటే దాని వెనకాల చంద్రబాబు అనే ఒక మాస్టర్ మైండ్ ఉంది.
• 25 సంవత్సరాల క్రితం సాఫ్ట్ వేర్ అనే ఒక కులం పుట్టింది. దానిలో ఏ కులం వారైనా నేను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని చెప్పుకునే వారు. దానికి కారణం చంద్రబాబుగారు.
• రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన చంద్రబాబు గారిపై గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు.
• ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ప్రజల క్షేమం కోసం చంద్రబాబు గారు కృషి చేశారు.
• కొప్పర్తికి ఇండస్ట్రియల్ నీళ్లు, జీఎన్‌ఎస్‌ఎస్ కాలువ పూర్తి చేసి కడపకు మంచినీళ్లు ఇవ్వాలని అడుగుతున్నాం.
• కొప్పర్తిలో మెగా ఇండస్ట్రీ తీసుకొచ్చి కడప రూపురేకలు మార్చలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.

