వైసీపీ తరపున జగన్ సోదరి షర్మిళ కూడా ప్రచారం చేయబోతున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా నేడు ఏపీలో పాలనపై ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో ముఖ్యం. ప్రజలు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా బూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి అనేది ఇసుమంతైనా కనిపించడంలేదు. ఇక పొత్తులు అన్నాడు, ప్యాకేజి అన్నాడు.. తీరా చూస్తే అవి కూడా సరిగా కొనసాగించలేడు. బీజేపీ నుండి తప్పుకొని సొంత కుంపటి అంటున్నాడు .. అభివృద్ధిలో రాష్ట్రము మొదటి స్థానంలో ఉందంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు.
రోజుకోమాట, పూటకో పథకంతో అసలు ఏమి చేస్తున్నది ఆయనకే తెలియని స్థితిలో పరిపాలన చేశాడు. నేడు ప్రచారంలో కూడా అదే కొనసాగుతుంది. మహిళలను కూడా వదలకుండా నెరవేర్చలేని హామీలు ఓట్లకోసం ఇచ్చి వారినీ మోసం చేశాడు. ఇచ్చిన హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకపోగా.. మళ్ళీ ఓట్లు ఎలా అడగాలనిపిస్తుందో .. ప్రజలు కూడా ఇవన్నీ చూస్తున్నారు.. వారే సరైన నిర్ణయం తీసుకుంటారు. వైస్సార్ హయాంలో భరోసాగా బ్రతికిన సామాన్యుడి పాలన మళ్ళీ రావాలంటే .. ఓటరు ఆలోచించి తమ హక్కును ఉపయోగించాల్సిన అవసరం ఉంది అన్నారు షర్మిళ.
కోర్టులతో ఆటలాడితే మొట్టికాయలు తప్పవు: రేవంత్ రెడ్డి