telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నుండి వాక్ అవుట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో తీవ్ర గందళగోళం చోటుచేసుకుంది.

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు నిరసన చేపట్టారు.

స్పీకర్ పోడియంలోకి చొచ్చుకువెళ్లిన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని వారు నినాదాలు చేశారు.

గందరగోళం మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

దాదాపు 11 నిమిషాల పాటు నినాదాలు చేసిన వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ సభ నుంచి బయటకు వచ్చేశారు.

Related posts