సమాజంలో మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఒంటరిగా ఏ ఆడిపిల్ల కనపించినా..చిన్న, పెద్ద, ముసలి అని చూడకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు.
గుడిలోనూ, బడిలోనూ, ఆస్పత్రుల్లో, రైల్లేస్టేషన్‌లోనూ మహిళలకు రక్షణ లేకుండో పోతోంది . నిర్భయ, దిశ లాంటి ఎన్ని వచ్చినా ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు.
తాజాగా ఏపీలోని బాపట్ల జిల్లాలో మహిళపై.. సామూహిక అత్యాచారం జరిగింది. భర్త ను కిరతంగా కొట్టి..అతడి కళ్ల ముందే ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు.
అవనిగడ్డలో పనుల కోసం భార్యభర్తలిద్దరూ నిన్న అర్ధరాత్రి సమయంలో రేపల్లే రైల్వేస్టేషన్‌లో దిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అవనిగడ్డ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో స్టేషన్‌లోని ఒకటో నెంబరు ప్లాట్ ఫాంపై పడుకున్నారు.
ఇదే సమయంలో ముగ్గురు వ్యక్తులు బల్లపై నిద్రిస్తున్న మహిళను పక్కకు లాక్కెళ్లిఅత్యాచారానికి పాల్పడ్డారు.వారికి అడ్డుపడ్డ భర్తపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితురాలైన మహిళను ఒడిశాకు చెందిన మహిళగా గుర్తించారు.
నిందితులను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బాధిత దంపతులు నుంచి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాధితులను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
.