telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

140 పాములను పెంచుకుంటోంది… చివరకు అవే ఆమె పాలిట…!?

Snake

ఇండియానాలోని ఆక్స్‌ఫర్డ్‌లో ఉండే లారా హర్ట్‌ (36)కు పాములంటే చాలా ఇష్టం. దాంతో లారా తన ఇంట్లో ఏకంగా 140 పాములను పెంచుకుంటోంది. ఆమె పెంచుకుంటున్న పాముల్లో ఓ ఎనిమిది అడుగుల కొండచిలువ కూడా ఉంది. అదే ఆమె ప్రాణం తీసింది. బుధవారం లారా మెడను ఆ కొండచిలువ బలంగా చుట్టేయడంతో ఊపిరాడక ఆమె చనిపోయింది. ఇది గమనించిన పొరుగింటివారు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో లారా ఇంటికి వచ్చిన పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం లారా ఇంటిని తనిఖీ చేయగా 140కి పైగా పాములను గుర్తించారు. దీంతో ఈ విషయమై పొరుగింటి వారిని పోలీసులు ప్రశ్నించగా అవి ఆమె పెంచుకుంటున్న పాములుగా చెప్పారు. ఇక లారా పోస్టుమార్టం రిపోర్టులో ఆమె మెడకు బలమైన వస్తువు చుట్టుకోవడం వల్ల చనిపోయినట్లు వచ్చింది. దీంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కొండచిలువే ఆమె మరణానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ఎంతో ప్రేమగా పాములు పెంచుకున్న లారా జీవితం వాటి కారణంగానే ఇలా విషాదంగా ముగియడం బాధకరమని పోలీసులు పేర్కొన్నారు.

Related posts