telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సిదంమైన ఏపీ ఎగ్జిట్ పోల్స్ అక్కడ “అధికారం” ఎవరికీ?

ఏపీలో ఫలితాల పై ఉత్కంఠ పెరుగుతోంది. ప్రధాన పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటనకు సిద్దం అవుతున్నాయి.

జూన్ 4న ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ సమయంలోనే పార్టీల నేతలు తమ అంచనాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఆసక్తి కర లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు సర్వే సంస్థలు సిద్దమయ్యాయి. ఈ సారి ఎన్నికల సమరం సాగిన విధంగానే ఫలితంలోనూ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే, ఈ సారి ఫలితాలను అంచనా వేయటం సర్వే సంస్థల పరీక్షగా మారుతున్నాయి.

జాతీయ సంస్థలు రాష్ట్రంలో శాంపిల్స్ సేకరించాయి. ఫలితం పైన ఒక అంచనాకు వచ్చాయి. జూన్ 1వ తేదీ సాయంత్రం తమ అంచనాలను వెల్లడించనున్నాయి.

రాష్ట్రంలో దాదాపు 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీన్ కంటెస్ట్ ఉంది. వీటిలో ఎవరు మెజార్టీ సీట్లు సాధిస్తే వారికి అధికారం దగ్గరయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఈ నియోజకవర్గాల్లో రెండు వైపులా బలమైన అభ్యర్దులు బరిలో ఉన్నారు. ఇక్కడ సామాజిక సమీకరణాలు కీలకంగా పని చేసాయి.

కానీ, అంతిమ ఫలితం పైన మాత్రం సర్వే సంస్థలకు అంతు చిక్కటం లేదు.

సీఎం జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు.

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో వైసీపీకి 45 సీట్లు కూడా రావని ధీమా వ్యక్తం చేసారు.

దీంతో..ఎగ్జిట్ పోల్స్ తో పాటుగా వాస్తవ ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Related posts