డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.. జో బైడెన్‌ను ఎన్నుకున్నారు అమెరికన్లు.. అయితే, ఈ ఎన్నికపై వివాదం కొనసాగుతూనే ఉంది.. జో బైడెన్ విజయంపై కోర్టులను ఆశ్రయిస్తూనే ఉంది ట్రంప్ టీమ్.. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్… ఈ ఎన్నికల్లో జో బైడెన్‌ను విజేతగా ఎలక్టోరల్ కాలేజీ అధికారికంగా ధ్రువీకరించే వరకు తాను వైట్‌హౌస్‌లోనే ఉంటానని.. అధికారికంగా ప్రకటించిన వెంటనే తాను వైట్‌హౌస్ నుంచి తప్పుకొని వెళ్లిపోతానని ప్రకటించారు. కాగా, ఎన్నికల ఫలితాలను నిరాకరించడంతో పాటు పోలింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారంటూ కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నవంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలపై మీడియా ప్రతినిధులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ట్రంప్.. జనవరి 20న బైడెన్ పాలనకు ముందు కాలానికి మాత్రమే సేవ చేస్తానని అంగీకరించారు. బైడెన్ విజయాన్ని ధ్రువీకరిస్తే వైట్‌హౌస్ నుంచి వెళ్లిపోతారా?’ అని మరో ప్రశ్న ఎదురుకాగా.. తప్పకుండా చేస్తాను.. ఆ విషయం నీకు తెలుసా? అంటూ ఎదురుప్రశ్నించారు. కానీ, అలా చేసినట్లయితే వారు తప్పు చేసినట్లే.. అంగీకరించానికి చాలా కష్టం అని వ్యాఖ్యానించారు. జనవరి 20వ తేదీ మధ్య చాలా విషయాలు జరగవచ్చని నేను భావిస్తున్నాను అంటూ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాగా, వైట్‌హౌస్ విజేతను నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజ్ వచ్చే నెల 14వ తేదీన సమావేశం కానుంది.. ఈ సమావేశంలోనే బైడెన్ గెలుపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
previous post
next post