telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కోడికత్తి, గులక రాయి డ్రామా లు చూశాం కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్లు: చంద్రబాబు

మనం కోడి కత్తి డ్రామా చూశాం గులక రాయి డ్రామా చూశాం. కోడి కత్తి డ్రామా పని చేసింది.. కానీ గులక రాయి డ్రామా పని చేయలేదని తెలిపారు చంద్రబాబు. తాజాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణం సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు.అవినీతి డబ్బును ఎన్నికల్లో రాష్ట్రమంతా పంచారు.

కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. డబ్బు తీసుకొని కూడా కూటమికి ఓటు వేసి గెలిపించారు. బాధితులనే నిందితులుగా చేసిన ఘనత వైసీపీదే. నేరస్తుడే సీఎం అయితే ఎలా ఉంటుందో చూశాం.

యథేచ్చగా ఇసుక దోపిడి చేశారు. రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. పులివెందుల మాదిరిగానే రాష్ట్రాన్ని తయారు చేయాలనుకున్నారు.

రాష్ట్రంలో హింసకు తావు లేదు. జగన్ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీకి వెళ్లారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేదే లేదు.

నేరాలు చేయాలనుకుంటే రాష్ట్రాన్ని వదిలిపెట్టే పరిస్థితి వస్తుందని తెలిపారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధిలోకి తీసుకొస్తాం అన్నారు.

Related posts