telugu navyamedia
రాజకీయ

ర‌ష్యాలో కుప్ప కూలిన విమానం..

రష్యాలో ఓ విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 16 మంది మరణించగా.. సుమారు ఏడుగురు గాయపడ్డారు. ఇవాళ 23 మంది ప్రయాణికులతో మెన్జెలిన్స్క్ నగరం నుంచి బయలుదేరిన ఎల్ -410 టర్బోలెట్ విమానం.. టాటర్‌స్థాన్‌లో ఉదయం 9:11 గంటలకు కూలిపోయింది.

ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా.. గాయపడ్డ ఆరుగురు ప్రయాణికులను రెస్క్యూ సిబ్బంది కాపాడి ఆసుపత్రికి తరలించారు. విమానంలోని 23 మందిలో 21 మంది పారాచూట్ డైవర్స్ అని రష్యా వార్తా సంస్థలు తెలిపాయి.

ఆ విమానం వాలంటరీ సొసైటీ ఫర్ అసిస్టెన్స్ ఫర్ ఆర్మీ, ఏవియేషన్ మరియు నేవీ ఆఫ్ రష్యాకు చెందినది, ఇది తనను తాను స్పోర్ట్స్ మరియు డిఫెన్స్ ఆర్గనైజేషన్‌గా ప్రకటించింది..

Related posts