ప్రస్తుతం భారత జట్టులోకి వస్తున్న యువ ఆటగాళ్లు అందరూ రాణిస్తున్నారు. దాంతో ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎవరిని ఎంపిక చేస్తారు అనేదాని పై ఆసక్తి నెలకొంది. అయితే ఈ విషయం పై టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ… ‘గత కొన్ని రోజులుగా యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ సిరీస్‌లో అందివచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఇషాన్ కిషన్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ ఆట తీరు కూడా అద్భుతం. గొప్ప ఇన్నింగ్స్ ఆడారు. తొలి మ్యాచులలోనే ఎలాంటి బెరుకు లేకుండా బ్యాటింగ్ చేశారు’ అని ప్రశంసించారు. ‘ఈ ఏడాది చివరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించి నా పదిహేను మంది స్వ్యాడ్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లకు కచ్చితంగా స్థానం ఉంటుంది. తుది జట్టులో ఆడేందుకు వారిద్దరికి పూర్తి అర్హత ఉందని భావిస్తున్నా’ అని లక్ష్మణ్ అన్నారు.
previous post
next post
పీవీ కూతురును…మరో శంకరమ్మను చేయబోతున్నారు..