telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విశాల్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తండ్రి… అసలు విషయం ఇదీ…!

Vishal-and-Anisha

త‌మిళ స్టార్ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ పెళ్ళికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మేరకు మార్చి 18న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అనీశా రెడ్డితో నిశ్చితార్ధం జరుపుకున్నారు కూడా. మార్చి 10న వీరి ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌గా, అక్టోబ‌ర్‌లో పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే కొద్ది రోజులుగా వీరి పెళ్లికి సంబంధించి అనేక వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అనీషా త‌మ నిశ్చితార్థంకి సంబంధించిన ఫోటోల‌తో పాటు విశాల్‌తో దిగిన ఫోటోల‌ని ప‌ర్స‌న‌ల్ ఎకౌంట్ నుండి డిలీట్ చేయ‌డం వ‌ల‌న వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు తలెత్తాయ‌ని, వారి వివాహానికి బ్రేక్ ప‌డింద‌ని గాసిప్ రాయుళ్ళు చెప్పుకొచ్చారు. అయితే అనీశా ఇటీవ‌ల త‌న‌కి కాబోయే భ‌ర్త విశాల్‌కి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ “నువ్వు స్టార్‌గా మెర‌వ‌డానికి పుట్టావు. జీవితంలోకి మంచి రోజులు రానున్నాయి. ఆ న‌మ్మ‌కం నాకుంది. నిన్ను ఎప్ప‌టికి ప్రేమిస్తూనే ఉంటాను” అని అనీశా పేర్కొంది. అనీశా పోస్ట్‌తో అభిమానుల‌లో ఉన్న అనుమానాలు కాస్త‌ తొల‌గిపోయాయి. తాజాగా విశాల్ తండ్రి చెన్నైలో జరిగిన దమయంతి చిత్ర మీడియా సమావేశంలో పాల్గొన‌గా, విశాల్ పెళ్లి గురించి ఆయ‌న‌ని విలేక‌రులు ప్ర‌శ్నించారు. దీనిపై స్పందించిన జీకె రెడ్డి విశాల్, అనీశారెడ్డిల వివాహం నిర్ణయించిన ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే వివాహ తేదీని ఇంకా నిర్ణయించలేదని అన్నారు.దీంతో విశాల్ పెళ్ళిపై అభిమానుల‌కి పూర్తి క్లారిటీ వ‌చ్చేసింది.

Related posts